News January 21, 2026

గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

image

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.

Similar News

News February 10, 2026

కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

image

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

image

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్

image

చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో మరో చారిత్రక అడుగుకు సిద్ధమైంది. చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే ‘చంద్రయాన్-4’ మిషన్‌కు కీలకమైన ల్యాండింగ్ సైట్‌ను ఖరారు చేసింది. ఈసారి కూడా చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతానికే ఇస్రో ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ‘లూనార్ శాంపిల్ రిటర్న్’ మిషన్ కావడంతో ల్యాండింగ్‌, మట్టి సేకరణ, తిరిగి రావడం వంటి క్లిష్ట దశలు ఉన్నాయి. 2028 నాటికి ఈ మిషన్‌ను ప్రయోగించనున్నారు.