News August 31, 2024

గుడ్లవల్లేరు ఘటన.. కెమెరాల వెనక కథ ఇదేనా.?

image

గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో లేడిస్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా, కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వారు ఇద్దరి విషయం బయటకు రాకూడదనే కొందరు కావాలనే ఇలా చేయించినట్లు సమాచారం.

Similar News

News September 14, 2024

గొల్లపూడి వరకు HYD-VJA జాతీయ రహదారి విస్తరణ

image

HYD- VJA జాతీయ రహదారిని గొల్లపూడి వరకు విస్తరించనున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలుత దండుమల్కాపూర్(TG) నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని భావించినా, గొల్లపూడి వరకు 6 వరుసల రహదారి విస్తరించాలని కేంద్రం నిర్ణయించి ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది. 6 వరుసల రహదారి అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.

News September 14, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ 2వ సెమిస్టర్(రెగ్యులర్ & సప్లిమెంటరీ) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 25 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల విభాగం తెలిపింది.

News September 14, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మోర్(MS), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి నవంబర్ 31 వరకు ప్రతి శనివారం MS- SRC(నం.06077), ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం SRC- MS(నం.06078) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.