News March 20, 2024
గుడ్లూరు: ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడి మృతి

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News July 8, 2025
‘ఇళ్ల స్థలాలకు అర్హుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి’

ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఇళ్ల స్థలాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ చేసి, ఆ తర్వాత స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News July 8, 2025
తల్లులకు పాదాభివందనం చేయించాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తల్లులకు విద్యార్థుల చేత పాదాభివందనం చేయించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహణపై ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12.30 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు.
News July 8, 2025
ప్రకాశం: ఆ ప్రాంతంలో నిలిచిన మొహర్రం

ప్రకాశం జిల్లా తుమ్మలచెరువులో 2 రోజులుగా కొనసాగుతున్న మొహర్రం అనుకోకుండా నిలిచిపోయింది. దర్గా ప్రధాన ముజావర్ ఖైదా పీర్ల ఊరేగింపు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో కార్యక్రమం నిలిచిపోయింది. 2 రోజుల తర్వాత వీధుల్లో పీర్ల ఊరేగింపు మళ్లీ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. కాగా జులై 2న <<16912097>>మృతుడు Way2Newsతో<<>> ఆ గ్రామ పీర్ల గొప్పదనాన్ని వివరించిన విషయం తెలిసిందే.