News August 17, 2025
గుడ్లూరు: లారీని ఢీకొన్న బస్సు.. ఒకరి మృతి

ట్రావెల్ బస్సు లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురుకి గాయాలైన ఘటన గుడ్లూరు మండలం జాతీయ రహదారిపై తెట్టు ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెట్టు ప్లై ఓవర్ బ్రిడ్జిఫై లారీని వెనుక నుంచి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News August 17, 2025
గుడ్లూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుడ్లూరు మండలం చేవూరు గ్రామ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామదూత ఆశ్రమం ఎదురుగా ఉన్న శేషమ్మ సత్రం వద్ద నేల బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు గుడ్లూరు పోలీసు స్టేషన్ లేదా 91211 02206 నంబరుకు సంప్రదించాలని పోలీసులు కోరారు.
News August 17, 2025
హాస్టల్ విద్యార్థినిలకు రెడ్ క్రాస్ అండగా ఉంటుంది: RDO

నెల్లూరు RDO కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహ సముదాయంలోని విద్యార్థినులకు రెడ్ క్రాస్ అండగా ఉంటుందని కావలి రెడ్‌క్రాస్ అధ్యక్షులు, RDO ఎం. సన్నీ వంశీకృష్ణ పేర్కొన్నారు. శనివారం వసతిగృహ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్డీఓ ప్రారంభించి మాట్లాడారు. ఈ వసతి గృహాన్ని రెడ్ క్రాస్ దత్తత తీసుకుందని, విద్యార్థినులకు కనీస అవసరాలు కల్పించడం ప్రారంభించామన్నారు.
News August 16, 2025
నెల్లూరులో ఇద్దరు యువకుల మృతి

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆర్షద్(19), పోలయ్య(24) పినాకిని రైల్లో విజయవాడకు శనివారం బయల్దేరారు. మధ్యలో ఇద్దరూ డోర్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. నెల్లూరు, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య కొండాయపాలెం గేట్ వద్ద ఇద్దరూ జారి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.