News March 5, 2026

గుత్తా కామెంట్స్.. అమిత్ పోటీ ఎక్కడో..!

image

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అమిత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన రాకను కన్ఫర్మ్ చేసినట్లైంది. అయితే ఆయన ఎక్కడి నుంచి ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారన్న చర్చ నడుస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Similar News

News March 11, 2026

NTR: PG విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో పీజీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నానో టెక్నాలజీ మినహా మిగతా కోర్సుల పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1లోపు రూ.100 ఫైన్‌తో 2లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

మహబూబాబాద్: 10 రోజుల్లో 24 మంది మృతి!

image

గడ్డి మందు ప్రాణాలు తీస్తోంది. ఒకపక్క బ్యాన్ చేయాలని గొడవలు చేస్తుండగా, మరోపక్క ఆ మందు తాగి ఉసురు తీసుకుంటున్నారు. మహబూబాబాద్(D) కొత్తగూడ(M)లో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మార్చి 1 నుంచి 10 వరకు కేవలం 10 రోజుల్లోనే మండల వ్యాప్తంగా 24 మంది మరణించినట్లు సమాచారం. 11 మంది గడ్డిమందు తాగి సూసైడ్ చేసుకోగా, మరో 13 మంది సాధారణ కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది. వరుస సంతాప ఫ్లెక్సీలతో ప్రజలు భయపడుతున్నారు.