News September 21, 2025
గుత్తివారిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామ సచివాలయం సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నీలం రంగు బనియన్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, శరీరంపై గాయాలు లేవని, మద్యం అధికంగా సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా అనారోగ్యం కారణమై ఉండవచ్చని రేణిగుంట అర్బన్ పోలీసులు అనుమానిస్తున్నారు. వయసు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చు అని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 21, 2025
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ ఫైర్

GSTకి సంబంధించి PM మోదీ <<17785063>>వ్యాఖ్యలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్ అమలు చేసిన సింపుల్ GSTకి బదులు మీ ప్రభుత్వం గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లలో 9 శ్లాబ్స్ పెట్టి రూ.55 లక్షల కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు సేవింగ్స్ ఫెస్టివల్ అంటూ రూ.2.5 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు. పెద్ద గాయాలకు చిన్న బ్యాండ్ ఎయిడ్ వేయాలని చూస్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
News September 21, 2025
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బీచ్ ఫెస్టివల్ ప్రచారం: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూర్యలంక బీచ్ ఫెస్టివల్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రచారానికి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల, ఇంకోల్లు, గుంటూరు ప్రాంతాల నుంచి 35కి పైగా ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. వారు ఏపీ టూరిజం సహకారంతో తీరప్రాంత సౌందర్యం, సాంస్కృతిక వైభవాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రోత్సహించేందుకు అంగీకరించారు.
News September 21, 2025
అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.