News December 25, 2024

గుత్తి: లారీ ఢీకొని ఒకరు మృతి

image

గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ అదుపు తప్పి అతివేగంగా రోడ్డు పక్కన ఉన్న వాటర్ ప్లాంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ఎంగన్నపల్లికి చెందిన భాస్కర్(24) మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ సురేష్ స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు.  

Similar News

News December 26, 2024

బత్తలపల్లి: రైలు నుంచి కిందపడి యువతికి గాయాలు

image

బత్తలపల్లి మండలం డి చెర్లోపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కర్నూల్(D)కరివేములకు చెందిన హరిత రైలు నుంచి కిందపడి గాయపడింది. రైలులో బాత్‌రూమ్ వెళ్లి తిరిగి సీటు వద్దకు రాకపోవడంతో తమ్ముడు ధర్మవరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె మొబైల్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్‌మెన్‌ను అప్రమత్తం చేయడంతో డి చెర్లోపల్లి వద్ద గుర్తించారు. ఆమెను బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

News December 26, 2024

గాండ్లపెంట: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

గాండ్లపెంట మండలం గొడ్డువెలగల గ్రామపంచాయతీలోని నీరుకుంట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర(52) అనే రైతు వ్యవసాయ పొలంలో బోరు వద్ద మోటార్ ఫ్యూజులు వేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే చెందాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News December 25, 2024

ATP: విద్యుత్ షాక్‌తో కుమారుడి మృతి.. ఆటో బోల్తాపడి తండ్రికి గాయాలు

image

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం జె.వెంకటాంపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిలాష్ (19) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అభిలాష్ మృతదేహాన్ని తండ్రి శివయ్య ఆటోలో రాయదుర్గం ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.