News October 9, 2025

గుత్తి విద్యార్థికి రూ.51లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

image

గుత్తి పట్టణానికి చెందిన షేక్ బాషా, షేక్ రహమత్ బీ దంపతుల కుమారుడు షేక్ దాదా కలందర్ హైదరాబాదులోని బిట్స్ పిలానీ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. గత నెల 26న కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యంత ప్రతిభ కనబరిచి ఏడాదికి రూ.51 లక్షల ప్యాకేజీతో AMD కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ అయిపోగానే జాబ్‌లో చేరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలందర్‌ను తోటి విద్యార్థులు అభినందించారు.

Similar News

News October 9, 2025

SKLM: జీలుగ ఉత్పత్తులను సీఎంకు చూపించిన మంత్రి

image

రాష్ట్ర రాజధానిలో గురువారం సీఎం చంద్ర‌బాబుకి మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు జీలుగ ఉత్పత్తులను చూపించారు. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని CM రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. అటవీ ప్రాంతంలో వెదురు ఉత్పత్తుల విషయంలో దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్న కోరారు. ధరలు సూచించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు

News October 9, 2025

వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

image

HYD బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000, ఇప్పుడు మరో రూ.6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం గమనార్హం. ఫ్యూచర్‌లో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్‌పై మొగ్గుచూపుతున్నారు. దీంతో భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇలానే కొనసాగితే నెలాఖరుకి రూ.2లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.

News October 9, 2025

TRP ఉమ్మడి మహబూబ్‌నగర్ కన్వీనర్‌గా నవీన్ కుమార్

image

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్లను నియమిస్తూ పార్టీ ప్రధాన నాయకత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో MBNR సోషల్ మీడియా కన్వీనర్‌గా నవీన్ కుమార్ నియమితులయ్యారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు చేరవేయడంలో కన్వీనర్ల పాత్ర కీలకమని నాయకులు పేర్కొన్నారు.