News April 18, 2025

గుమ్మగట్ట: కరెంట్ షాక్‌తో టెన్త్ విద్యార్థి మృతి

image

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 8, 2025

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.

News September 7, 2025

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

News September 7, 2025

పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.