News February 14, 2025

గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి: హరీశ్‌రావు

image

పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనకి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండని, డంపింగ్ యార్డ్ వద్దంటే మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. CM రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడని, వందల మందిని పోలీస్ స్టేషన్లలో పెట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడన్నారు.

Similar News

News September 17, 2025

నిజాం పాలనకు చరిత్ర గుర్తు జగిత్యాల ఖిల్లా

image

నిజాం పాలన చరిత్ర గుర్తులుగా జగిత్యాలలోని ఖిలా సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రాల్లా ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్ల సాంకేతిక సహకారంతో నిర్మించారు. జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మించగా, ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది నిర్మించి దాదాపు 250 సం.లు కావొస్తుంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.

News September 17, 2025

ఉద్యమాల పురిటి గడ్డ.. జగిత్యాల జిల్లా

image

నిజాం రాచరిక పాలన నుంచి విముక్తి కల్పించి HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు జరిగిన ఉద్యమాల్లో జగిత్యాల నుంచి ఎందరో యోధులు పాల్గొన్నారు. వారి త్యాగాల ఫలితంగా 1948 SEC 17న HYD సంస్థానం దేశంలో విలీనమైంది. 1947 AUG 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా HYD సంస్థానం దేశంలో అంతర్భాగం కానీ పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, జగిత్యాల జైత్రయాత్రకు ఇక్కడి నుంచే పునాది.

News September 17, 2025

వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

image

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.