News June 19, 2024

గుమ్మడిదల: కోళ్ల ఫారంలో అల్ఫాజోలం తయారీ

image

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫారంలో అల్ఫాజోలం తయారీ చేస్తున్న కేంద్రంపై జిల్లా SP రూపేష్, టీఎస్ న్యాబ్, గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఆరు నెలలుగా మత్తు పదార్థాలైన అల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.40లక్షల విలువైన 2.60 లక్షల విలువైన అల్ఫాజోలం, రూ.60లక్షలు విలువైన ముడి పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు.

Similar News

News October 2, 2024

MDK: మహిళలు మౌనం వీడి రక్షణ పొందండి: జిల్లా ఎస్పీ

image

మహిళలు, విద్యార్థినులు, బాలికలు మౌనం వీడి వేధింపులపై షీ టీంకు సమాచారం ఇచ్చి రక్షణ పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల జిల్లాలోని ప్రతి పాఠశాలలు, కళాశాలలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. షీ టీం వాట్సాప్ నెంబర్ 87126 57963, 63039 23823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 57888లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News October 2, 2024

మెదక్: ప్రజలకు హరీష్ రావు బతుకమ్మ శుభాకాంక్షలు

image

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఆడపడుచులు కలిసి ఆడే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. దేశంలోనే పూల ను పూజించి ప్రకృతిని ప్రేమించే పండుగ అన్నారు. అలాంటి సంస్కృతి తెలంగాణలో ఉందన్నారు.

News October 2, 2024

సంగారెడ్డిలో దారుణం.. అన్నను చంపిన తమ్ముడు

image

సంగారెడ్డి పట్టణంలోని నాల్ సాబ్ గుడ్డలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ భాస్కర్ రెడ్డి కథనం ప్రకారం.. మద్యం మత్తులో అన్నషాహిద్(46)ను తమ్ముడు రఫిక్ (40) కల్లు సీసాతో కొట్టి హత్య చేశాడు. తనను, తన భార్యను అన్న సూటిపోటి మాటలతో బాధించేవాడని హంతకుడు రఫిక్ తెలిపారు. పోలీసులు రఫిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.