News April 4, 2025

గుమ్మడిదల: నాటు తుపాకీ, గంజాయి స్వాధీనం

image

నాటు తుపాకీ, గంజాయిని గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు. జిన్నారం CI నయీముద్దీన్ వివరాలు.. బీహార్‌కు చెందిన భూపేంద్ర కుమార్ ఆరేళ్లుగా దోమడుగులో కిరాయికి రూమ్ తీసుకొని శ్యామ్ పిస్టమ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం సరిపోక ఎక్కువ డబ్బు సంపాదించాలని బీహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు అతడి ఇంటిని తనిఖీ చేయగా నాటు తుపాకీ, 2 బుల్లేట్లు, 930 గ్రాముల గంజాయి పట్టుబడింది.

Similar News

News February 26, 2026

ఇండియన్ ఇన్వెస్టర్లకు బంపరాఫర్.. అమెరికన్ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడి

image

ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్లు ఇకపై నేరుగా US స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇంటర్నేషనల్ ఎక్స్‌ఛేంజ్ (NSE IX) గ్లోబల్ యాక్సెస్ యాప్‌ను NSE లాంచ్ చేసింది. దీని ద్వారా యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీల షేర్లను నేరుగా కొనుగోలు చేయొచ్చు. GIFT City ద్వారా పనిచేసే ఈ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడికి ప్రత్యేక డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. పాన్, ఆధార్ ఆధారిత డిజిటల్ KYC నిమిషంలోనే పూర్తవుతుంది.

News February 26, 2026

ERగా తిరుపతి.. త్వరలో కొత్త ఉద్యోగాలు

image

APని 2.4 ట్రి.న్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో GOVT తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER)కు ప్రత్యేక ప్రాంతీయ ఆర్థిక ప్రణాళికలు రూపొందించనుంది. విశాఖ ER నమూనాను ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. TERలో 9 జిల్లాలు ఉండి, GSDPలో దాదాపు 34% వాటా కలిగి ఉంది. ఉద్యానవనం, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, స్పేస్‌టెక్, పర్యాటకం, విద్య రంగాల్లో ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.

News February 26, 2026

ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌

image

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.