News April 14, 2025

గుమ్మడిదల : భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

Similar News

News April 15, 2025

KMM: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

image

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు ఎస్డీసీ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్.రాజేంద్ర గౌడ్‌ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.

News April 15, 2025

BREAKING: 2,260 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరుగా రెండు ఉత్తర్వులను ఇచ్చింది.

News April 15, 2025

ఒంటిమిట్ట: పుష్పయాగానికి సిద్ధం చేస్తున్న అధికారులు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ అధికారులు కావలసిన వివిధ రకాల పుష్పాలను ఆలయానికి సమకూర్చారు. పుష్పయాగానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!