News February 25, 2025

గుమ్మడిదల: మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం: జేఏసీ

image

గుమ్మడిదల మండలంలో చేపట్టిన డంప్ యార్డు రద్దును చేయకపోవడంతో నిరసనగా పార్టీలు, రాజకీయాలకు తీతంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు జేఏసీ పేర్కొంది. నేటికీ 21వ రోజు డంప్ యార్డ్‌కి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నుంచి ఏలాంటి స్పందన లేదన్నారు. దీంతో 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం లేదని వారు స్పష్టం చేశారు.

Similar News

News February 25, 2025

నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

image

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు

News February 25, 2025

నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

image

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్‌ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

News February 25, 2025

KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!

image

శాసన మండలి ఎన్నికలకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కోసం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్లలో పట్ట భద్రుల ఓటర్లకు 29, ఉపాధ్యాయులకు 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించి సామాగ్రి కామారెడ్డిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు ఇప్పటికే రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు.

error: Content is protected !!