News May 20, 2024
గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసులు

పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని గురజాల, మాచర్ల నియోజక వర్గాలలోని పలు గ్రామాల్లో జరిగిన అల్లర్లపై ఐపీసీ 448, 427, 324, 147, 148, 341, 323, 324, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Similar News
News January 6, 2026
ANU బీ ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనున్న బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం 7వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివ ప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 22 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 23వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.
News January 6, 2026
తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

తెనాలి వహాబ్ చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
News January 6, 2026
GNT: ‘స్వీకారం’ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం

జిల్లాలో SC, ST, BC, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘స్వీకారం’ పేరుతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా’ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ వర్గాల సంస్థలతో తమీమ్ అన్సారియా మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.


