News September 11, 2025

గురుకులాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్

image

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.

Similar News

News September 11, 2025

వరంగల్: హోంగార్డుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి: అదనపు డీసీపీ

image

హోంగార్డుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అదనపు డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డుల సమస్యలపై అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నాగయ్యతో కలిసి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

News September 11, 2025

సిరిసిల్ల: ‘ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలి’

image

ప్రతి గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు, మండల ప్రజా పరిషత్ అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు టీబీపై అపోహలు తొలగిస్తూ వ్యాధి సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాలన్నారు.

News September 11, 2025

వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి: CM

image

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం అన్నారు.