News March 29, 2025

గురుకుల విద్యార్థి మృతి బాధాకరం: హరీశ్ రావు

image

సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదొక నిదర్శనమన్నారు. నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 17, 2025

మావోయిస్టు పార్టీ లేఖపై అనుమానాలు!

image

ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట రిలీజైన లేఖపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇప్పటి వరకు ఇలా సంతకం, ఫొటోతో లేఖ రిలీజ్ కాలేదు. AUG 15వ తేదీ అని ఉంది. మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామనే ప్రకటన ఇంత సులభంగా ఉండదు. దానికి దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ ఉంటుంది’ అని చెబుతున్నారు. మరోవైపు ఈ లేఖను వెరిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News September 17, 2025

తిరుగుబాటుకు తొలి అడుగు వీర బైరాన్‌పల్లి

image

రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి, తిరుగుబాటును ప్రారంభించిన తొలి గ్రామం వీర బైరాన్‌పల్లి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణలో ఇంకా పోరాటం కొనసాగుతున్న ఆ సమయంలో.. పొరుగు గ్రామాలను దోచుకెళుతున్న రజాకార్లను ధైర్యంగా అడ్డుకుంది. 126 మంది వీరుల త్యాగానికి నిదర్శనంగా ఉన్న అమరవీరుల స్తూపం ఇక్కడ నెలకొంది.

News September 17, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి రూ.1,11,710కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.200 పతనమై రూ.1,02,400 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2,000 తగ్గి రూ.1,42,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.