News November 10, 2025
గురుకుల విద్యార్థులకు “నీట్” పరీక్షకు ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి ఉమ కుమారి సోమవారం ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2025
సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.
News November 10, 2025
ఆదిలాబాద్: సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఎస్పీ

ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల రోజును ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎస్పీని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చారు. బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు.
News November 10, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పార్వతీపురం మన్యం ఎస్పీ ఎన్.మాధవరెడ్డి ఆదేశాలతో పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పార్కింగ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో చేస్తున్న తనిఖీలను ఎస్పీ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో తనిఖీలు ముమ్మరం చేశారు.


