News April 12, 2025
గురుకుల విద్యార్థులకు మంత్రి స్వామి అభినందనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల్లో 96% ఉత్తీర్ణత సాధించిన గురుకుల పాఠశాలల విద్యార్థులకు మంత్రి స్వామి శనివారం అభినందనలు తెలిపారు. ఈ ఉత్తీర్ణత సాధనలో భాగస్వాములైన గురుకుల సంస్థ ఉన్నతాధికారులకు, ఉపాధ్యాయులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇలాంటి విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Similar News
News April 12, 2025
మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులే: ఎస్పీ

సోషల్ మీడియా మాధ్యమాలలో ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఏఅర్.దామోదర్ శనివారం హెచ్చరించారు. మహిళలపై ఫోన్లలో, సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
News April 12, 2025
ప్రకాశం జిల్లాకు 16వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 16236 మంది పరీక్షలు రాయగా.. 12863 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే 16వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 18715 మందికి, 11798 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 19వ స్థానంలో ప్రకాశం జిల్లా నిలిచింది.
News April 12, 2025
మార్కాపురం తహశీల్దార్‌కి ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.