News November 12, 2025
గురువు పాదాలకు నమస్కరించిన మంత్రి కేశవ్

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన చిన్ననాటి గురువు గంగాధర శాస్త్రిని పుట్టపర్తి శాంతి నిలయంలో మంగళవారం కలిశారు. గురువు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యార్థి దశలో బోధించిన ఉపాధ్యాయుడిని కలవడం ఆనందకరమైన క్షణమని మంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్రం గర్వించదగిన నాయకుడిగా శిష్యుడు ఎదగడంపై గంగాధర శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News November 12, 2025
32,438 పోస్టులు.. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు

రేపటి నుంచి గ్రూప్-D <<17650787>>పరీక్షలకు<<>> సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు RRB(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) తెలిపింది. 32,438 పోస్టులకు ఈ నెల 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందుగానే పరీక్ష తేదీ, సిటీ వివరాలను RRB వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
News November 12, 2025
సంగారెడ్డి: కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ

జిల్లా వైద్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 12 పోస్టులు భర్తీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల మంగళవారం తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి 12 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. కౌన్సిలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు.
News November 12, 2025
HYD: ఈ టైమ్‌లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.


