News August 21, 2025

గుర్తింపులేని పార్టీలకు షోకాజ్ నోటిసులిచ్చాం: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయబడి 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీచేయని గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీచేసిందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. గ్రేట్ ఇండియా పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఆ పార్టీల బాధ్యులు ఈనెల 28 లోపు వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ ప్రధాన ఎన్నికల అధికారిముందు వివరణ ఇచ్చేందుకు ఆధారపత్రాలతో హాజరు కావాలన్నారు.

Similar News

News August 21, 2025

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.

News August 21, 2025

అప్పర్, మిడ్ మానేరు డ్యాంల ప్రస్తుత నీటి వివరాలు

image

అప్పర్ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి 1,482.50 అడుగులకు చేరి 2.00 టీఎంసీలతో నిండి ఉంది. 2,202 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అంతమొత్తాన్ని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు జలాశయం 312.58 మీటర్ల వద్ద 15.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 18,380 క్యూసెక్కుల ప్రవాహం రాగా, 3,310 క్యూసెక్కుల నీటిని ప్యాకేజీల ద్వారా విడుదల చేస్తున్నామని అధికారులు గురువారం ఉదయం తెలిపారు.

News August 21, 2025

ఏలూరు: వరద ముప్పు.. మూటాముళ్లే సర్దుకొని పయనం

image

ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో గోదావరి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి పరిస్థితిని పరిశీలిస్తూ, ముంపు ప్రభావిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రేపాకుగోమ్ము గ్రామంలో నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పంట పొలాలు, రహదారులు, వంతెనలు నీటమునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.