News August 29, 2025
గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు సమావేశం: కలెక్టర్

కోనసీమ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, 2019 నుంచి 6 సంవత్సరాలలో ఏ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీల ప్రతినిధులు సెప్టెంబర్ 8వ తేదీన అమరావతిలో నిర్వహించి సమావేశానికి హాజరు కావాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ జిల్లాలో ఏ ఒక్క ఎన్నికలో 6 ఏళ్లలో పోటీ చేయలేదన్నారు.
Similar News
News August 29, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ మంగళగిరిలో 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ధననాథుడు
☞ అలజడులు సృష్టించేందుకు YCP కుట్ర: జూలకంటి
☞ తెనాలిలో రెండు టన్నుల భారీ శివలింగం లడ్డు
☞ ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం
☞ మంగళగిరిలో రెండు రైళ్లల్లో చోరీలు
☞ మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
☞ పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో బిగ్ షాక్
☞ తుళ్లూరులో జాబ్ మేళా.. 91 మందికి ఉద్యోగాలు
News August 29, 2025
ఆదిలాబాద్: మట్కా కేసులో నిందితుడు అరెస్ట్

మట్కా కేసులో నిందితుడిని పోలీసులు ఎనిమిదేళ్ల అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన మొహ్మద్ లతీఫ్ మట్కా నిర్వహిస్తుండగా 2018లో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అతను పరారవ్వగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేయటానికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయగా శుక్రవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.
News August 29, 2025
శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. జింబాబ్వేకు హార్ట్ బ్రేక్

జింబాబ్వేతో తొలి వన్డేలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 298/6 పరుగులు చేసింది. నిస్సాంక(76), లియనగే(70*) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 291/8 పరుగులు చేసి పోరాడి ఓడింది. సికందర్ రజా(92) ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా శ్రీలంక బౌలర్ మధుశంక హ్యాట్రిక్ వికెట్లు తీసి, 2రన్సే ఇచ్చారు.