News December 25, 2025
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘థాయ్ కిళవి’ సినిమా కోసం పూర్తిస్థాయి గ్రామీణ వృద్ధురాలి పాత్రలో ఒదిగిపోయారు. మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో’ అంటూ ఆమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.
Similar News
News December 25, 2025
కోహ్లీ క్రేజ్.. VHT స్కోర్ కోసం 10 లక్షల సెర్చ్‌లు

కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు ఆడుతున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు. ముఖ్యంగా కోహ్లీ లైవ్ స్కోర్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 10 గంటల వ్యవధిలో ఢిల్లీ-ఆంధ్రా మ్యాచ్ అప్డేట్స్ కోసం 10 లక్షలకు పైగా సెర్చ్‌లు నమోదయ్యాయి. ఏకంగా 1,81,818 సార్లు రీఫ్రెష్ చేశారు. నిన్నటి మ్యాచ్‌లో కింగ్ 101 బంతుల్లో 131 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
News December 25, 2025
కనుక్కోండి చూద్దాం.. వీరిలో రోహిత్ ఎవరు?

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న సిక్కింతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ <<18659152>>మెరిసిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వికెట్ కీపర్ హార్దిక్ తమోరేతో రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ కూడా రోహిత్‌లా ఉండటమే ఇందుకు కారణం. అసలైన రోహిత్‌లా హార్దిక్ తమోరే కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పేరు, జెర్సీ నంబర్ లేకపోతే కనిపెట్టలేమని అంటున్నారు. మరి మీరేమంటారు?
News December 25, 2025
మహిళలపై కంట్రోల్ కోసమే ఇదంతా: అనసూయ

పాత తరాలు అలవాటుపడ్డ ఆలోచనలను మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని నటి <<18662962>>అనసూయ<<>> పేర్కొన్నారు. ‘కొంతమంది వయసు ఆధారంగా నన్ను తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనున్న వాళ్లు ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది’ అని ట్వీట్ చేశారు.


