News April 5, 2024
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఫోటో గ్రాఫర్ మృతి

కోదాడకు చెందిన గుండు రవి పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై కోదాడ వస్తుండగా వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రవి కోదాడలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రవి మృతి పట్ల ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News November 5, 2025
శివ నామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు

నల్గొండ జిల్లాలో కార్తీక మాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జిల్లాలో చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామీ, పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంతో పాటు వివిధ ఆలయాలకు భక్తులు ఉదయమే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయాలు దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
News November 5, 2025
NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.


