News August 21, 2025

‘గుర్తేడు’ను మండల కేంద్రంగా చేయాలని డిమాండ్

image

గుర్తేడును మండల కేంద్రంగా చేయాలని బుధవారం పాతకోటలో గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుష్యంతుడు మాట్లాడుతూ.. గుర్తేడును మండల కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, కొంతమంది గిరిజనేతరులు స్వలాభం కోసం, రాజకీయ లబ్ధికోసం డొంకరాయి ప్రాంతాన్ని కేంద్రంగా చేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుర్తేడులోని ఐదు గిరిజన పంచాయతీ ప్రజలు బుధవారం భారీ ర్యాలీ చేస్తూ నిరసనలు తెలిపారు.

Similar News

News August 21, 2025

KNR: వృద్ధులపై కఠినంగా బిడ్డలు

image

పింఛన్, ఆస్తి.. కారణమేదైనా మలిదశలో తల్లిదండ్రులను కాదనే ప్రభుద్ధులెందరో ఉమ్మడి KNRలో ఇప్పటికీ ఉన్నారు. కొన్నినెలల క్రితం JGTL(D)వెల్గటూర్, రాయికల్, కోరుట్లల్లో వివిధకారణాలతో బిడ్డల నుంచి భరోసా కరవై వృద్ధులు రోడ్డెక్కారు. తాజాగా KNR(D)శంకరపట్నం మొలంగూర్లో ఓ కొడుకు<<17470521>> తల్లిని బయటకు గెంటేసి<<>> ఇంటికి తాళమేసుకున్నాడు. ఇలాంటి బాధితులు RDOలు, పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలిసి న్యాయం పొందొచ్చు.

News August 21, 2025

కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి రూ.904 కోట్ల మంజూరు, రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాసేపట్లో మంత్రివర్గ భేటీ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.

News August 21, 2025

HYD: ఒక్క పిల్లర్ నిర్మాణం వెనక నెలల కష్టం

image

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఒక్క పిల్లర్ నిర్మాణం వెనుక నెలల కష్టం ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. పిల్లర్ల నిర్మాణం ఇన్ సిట్యూ పద్ధతిలో అక్కడే జరుగుతుంది. పిల్లర్ల నిర్మాణంలో ఫౌండేషన్ ఒకేత్తయితే, పైభాగం(వెబ్) నిర్మాణం మరో ఎత్తు. పిల్లర్‌పై భాగం నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్ అవసరం ఉంటుందని AE అనిల్ తెలిపారు.