News October 16, 2024
గుర్లలో కోరలు చాచిన డయేరియా
విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో డయేరియా కోరలు చాచింది. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు మ్యత్యవాత పడ్డారు. బుధవారానికి డయేరియా కేసులు మరిన్ని పెరిగాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో161 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలిందని బాధితులు చెబుతున్నారు. నెల్లిమర్ల సీహెచ్సీ, విజయనగరం పెద్ద ఆసుపత్రి, గోషాలో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 21, 2024
ఎస్ కోటలో స్కూళ్లకు సెలవులు
తుఫాన్ నేపథ్యంలో ఎస్. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఎంఈవో నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యథావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. మరి మీ మండలంలో సెలవు ప్రకటించారా ? కామెంట్ చేయండి.
News December 21, 2024
విజయనగరం పోలీసులను అభినందించిన మంత్రి లోకేశ్
విజయనగరం పోలీసులకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు కురిపించారు. బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి సెపరేట్ డెన్లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
News December 21, 2024
ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.