News February 1, 2025
గుర్ల: విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి సూసైడ్
గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్‌మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్‌మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.
Similar News
News February 1, 2025
మెరకుముడిదాం: ట్రాక్టర్ నుంచి పడి వ్యక్తి మృతి
ఇంటిపెద్ద అకాల మరణంతో ఓ కుటుంబం అనాథగా మారింది. మెరకముడిదాం గ్రామానికి చెందిన గౌరీనాయడు(50) శుక్రవారం మృతి చెందాడు. గడ్డిని ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తుండగా కిందపడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు.
News February 1, 2025
జామి: సర్వర్ డౌన్.. పెన్షన్ పంపిణీ ఆలస్యం
ఫిబ్రవరి నెలకు పెన్షన్ పంపిణీ వేకువజాము నుంచే సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే జామి, ఎస్.కోట, తదితర మండలాల్లో సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ కోసం వేకువజామునే లబ్ధిదారుల ఇంటికి చేరుకున్నారు. సర్వర్ డౌన్ కావడంతో లబ్ధిదారులు ఇంటి వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంపై జామి మండల అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యను టెక్నికల్ టీమ్‌కు తెలిపామన్నారు.
News February 1, 2025
VZM: రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి రాజకీయ ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.