News November 21, 2025

గులాం రసూల్ సేవలు మరువలేనివని: పల్లె శేఖర్ రెడ్డి

image

పేదల ఆశాజ్యోతి గులాం రసూల్ సేవలు మరువలేనివని సీపీఐ యాదాద్రి జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. రసూల్ 10వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో నివాళులర్పించారు. రాచకొండ ఫైరింగ్ రేంజ్ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని, గిరిజనులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. జడ్పీటీసీ, MPTCగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన నాయకుడు అన్నారు.

Similar News

News November 21, 2025

కడప కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

image

కడప కలెక్టరేట్‌లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

భూపాలపల్లి: గ్రామాల్లో మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని గ్రామాలకు మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీచేస్తూ కలెక్టర్ నుంచి ప్రకటన వెల్లడించారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు స్థానికులై అదే మండలానికి చెందినవారై ఉండాలని, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.

News November 21, 2025

హైదరాబాద్ RRR రీ సర్వే తప్పనిసరి: కవిత

image

రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాటలో కవిత పర్యటన సాగుతుంది. RRR భూసేకరణలో అక్రమాలు జరిగాయని, రీ–సర్వే తప్పనిసరి అని ఆమె డిమాండ్ చేశారు. చెరువుల కబ్జాలు, ఆర్ఆర్ఆర్ ఆలైన్‌మెంట్ మార్పుల పెద్దల కోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఒక్క న్యాయం పెద్దలకు మరో న్యాయమా? అంటూ కవిత నిలదీశారు.