News November 11, 2025
గూగుల్ కొత్త ఫీచర్.. బ్యాటరీ తినేసే యాప్స్‌కు చెక్!

బ్యాటరీ తినేసే యాప్‌లకు చెక్ పెట్టే కొత్త ఫీచర్‌ను 2026 మార్చి 1 నుంచి గూగుల్ అమలులోకి తెస్తోంది. 24 గంటల్లో 2 గంటలకు మించి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితే దానిని బ్యాటరీ డ్రెయిన్ యాప్‌గా గుర్తిస్తారు. వీటిపై డెవలపర్స్‌ను గూగుల్ ముందుగా అలర్ట్ చేస్తుంది. సమస్యను ఫిక్స్ చేయకుంటే ప్లేస్టోర్‌లో ప్రాధాన్యం తగ్గిస్తుంది. యాప్స్‌ను ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్, అప్‌డేట్ చేసుకునేటప్పుడు యూజర్లను హెచ్చరిస్తోంది.
Similar News
News November 11, 2025
లేటెస్ట్ అప్‌డేట్స్

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు
News November 11, 2025
పాక్‌లో ఆత్మాహుతి దాడి వెనుక భారత్: షరీఫ్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై విషం కక్కారు. ఇస్లామాబాద్‌లో జరిగిన <<18258453>>ఆత్మాహుతి దాడి<<>> వెనుక ఇండియా ఉందంటూ ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే TTP భారత్ ఆడించే తోలుబొమ్మ అని అక్కసు వెళ్లగక్కారు. ఇది అనేక మంది చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని, దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.
News November 11, 2025
తానికాయ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

త్రిఫలాలలో(ఉసిరి, తాని, కరక్కాయ) ఒకటైన తానికాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తానికాయ పొడిలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. విరేచనాలు, చిన్న పేగుల వాపు తగ్గి.. జీర్ణ, శ్వాస, మూత్రాశయ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ పొడిలో చక్కెర కలిపి తింటే కంటిచూపు మెరుగవుతుందని చెబుతున్నారు.


