News January 20, 2026

గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ

image

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్‌ కురియన్‌తో AP CM చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, జాప్యం లేకుండా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని CBN కోరారు. IBM ఛైర్మన్ అరవింద్ కృష్ణతోనూ CM సమావేశం అయ్యారు. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌పై చర్చించారు.

Similar News

News February 16, 2026

అటు బంగ్లా, ఇటు పాక్‌‌కు చెక్ పెట్టిన భారత్

image

తమ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి పౌరులకు భద్రత కల్పించిన భారత్‌లోనే రక్షణ లేదంటూ బంగ్లాదేశ్ అహంకారం ఒకవైపు. ‘మేం కూడా భారత్‌తో మ్యాచ్ ఆడం’ అంటూ చివరి వరకు నక్క తెలివితేటలు చూపిన పాకిస్థాన్ మరోవైపు. ఈ రెండు దేశాల తలపొగరును <<19153355>>తన ఆటతో<<>> దించేసింది టీమ్ ఇండియా. ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి ఫేమస్ డైలాగ్ మాదిరిగా చాలా పద్ధతిగా, సమష్టిగా దెబ్బకొట్టింది. ‘తగ్గేదేలే’ అంటూ భారత్ మరోసారి సత్తా చాటింది.

News February 16, 2026

TODAY HEADLINES

image

* T20WC: పాక్‌పై భారత్ ఘన విజయం
* జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ
* CECపై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు
* ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో
* కోవా బన్ను వివాదం.. బాధితుడికి లోకేశ్ మద్దతు
* రైతులకు రూ.20వేలు ఎక్కడ: YCP
* మున్సిపల్ ఫలితాలు నా పనికి గీటురాయి: రేవంత్
* TG: రేపే మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక
* TG: ఒకే విడతలో రైతుభరోసా.. 17న జమ!

News February 16, 2026

మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

image

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.