News October 31, 2024
గూడూరు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడి హత్య
వరగలి గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడు లాసిక్‌ను ఉద్దేశ పూర్వకంగానే చంపినట్లు గూడూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బాలుడు తల్లికి అనిల్ అనే వ్యక్తికి ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అన్నారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించిన అనిల్.. చరణ్ అనే వ్యక్తితో కలిసి ఉప్పుటేరులో బాలుడిని తోసి చంపారని ఆయన తెలిపారు.
Similar News
News January 11, 2025
నెల్లూరులో వివాహిత ఆత్మహత్య
కుమారుడిని అత్త మందలించిందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన రుబీనా(22) అంజద్‌కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. రుబీనా రెండేళ్ల కుమారుడు సోఫాపై మూత్రం పోశాడు. దీంతో అత్త బాలుడిని మందలించింది. మనస్తాపం చెందిన రుబీనా ఇంట్లో ఉరి వేసుకుంది. కుబుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
News January 11, 2025
ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తాం: కలెక్టర్
నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.
News January 10, 2025
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 10 లక్షల సాయం
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.