News October 22, 2024
గూడూరు: చనిపోయింది టీడీపీ కార్యకర్త..!

గూడూరు నియోజవర్గం చిల్లకూరు(M) నాంచారంపేటలో సోమవారం రాత్రి ఒకరు దారుణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మృతుడు మల్లారపు హరిప్రసాద్(20)గా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న హరిప్రసాద్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హరిప్రసాద్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. వైసీపీ నాయకుడే ఇలా చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 29, 2025
వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలు: DMHO

ఇందుకూరుపేట మండలం లేబూరు బిట్-1లో ఏర్పాటుచేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని DMHO సుజాత పరిశీలించారు. శిబిరంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. సైక్లోన్ అనంతరం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందులు, రికార్డులు పరిశీలించారు. సర్పంచ్ వరిగొండ సుమతి, మెడికల్ ఆఫీసర్ బ్రహ్మేశ్వర నాయుడు పాల్గొన్నారు.
News October 29, 2025
మన నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా

కలెక్టర్ హిమాన్షు శుక్ల సాధారణ వ్యక్తిలా మారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పునరావాస కేంద్రంలో చిన్నారులకు పాఠాలు చెప్పి వారిని నవ్వించారు. అలాగే వారితో గడిపిన క్షణాలను గుర్తు పెట్టుకొనేందుకు సెల్ఫీ తీసుకున్నారు. కలెక్టర్ స్థాయిలో బాధితులపై ఆయన చూపిన ప్రేమకు అక్కడివారు ముగ్దులయ్యారు.
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.


