News April 1, 2024

గూడూరు: టీచర్ మృతి

image

రైలు కిందపడి టీచర్ మృతిచెందిన ఘటన గూడూరులో వెలుగు చూసింది. గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్‌లో చెన్నై మెమూ రైలు దిగుతుండగా ప్రమాదశావత్తు జారిపడిపోయారు. రైలు కింద పడిపోవడంతో చనిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 9, 2026

CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.

News March 8, 2026

నాయుడుపేట: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

image

పెళ్లకూరు వద్ద నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై అదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూల్‌డ్రింక్స్ లారీని బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బోడెద్దుల భరత్ (20) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముని కుమార్‌ను 108 అంబులెన్స్‌లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 8, 2026

ఫైనల్ మ్యాచ్‌కు నెల్లూరులో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

image

నెల్లూరు నగరంలోని పలు రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని రెస్టారెంట్ యజమానులు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువత మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను పెద్ద స్క్రీన్‌లో, స్నేహితులతో కేరింతలు కొడుతూ చూడాలని ఆశతో ఉన్నారు.