News December 13, 2024

గూడూరు: డాక్టర్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

image

వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యాధికారి వేధిస్తున్నారంటూ పలువురు మహిళా ఉద్యోగుల ఆరోపించారు. ఈ మేరకు వారు గురువారం సాయంత్రం గూడూరు డీఎస్పీతోపాటూ విజయవాడలోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 

Similar News

News December 26, 2024

REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి

image

సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.

News December 26, 2024

నెల్లూరు జిల్లాలో చలిగాలులతో వణుకుతున్న ప్రజలు

image

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో వృద్ధులు పిల్లలతో పాటు సాధారణ ప్రజలు కూడా చలికి గజగజ వణికి పోతున్నారు.

News December 26, 2024

నెల్లూరు జిల్లాలో రూ.95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం

image

నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రూ.95 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఈ కర్మాగారం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు, ప్రత్యక్షంగాను, పరోక్షంగా పెరుగుతాయని, విద్యావంతులకు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి అపారమైన అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.