News November 29, 2025
గూడూరు: పోలీస్ చెక్ పోస్ట్‌ను ఎస్పీ తనిఖీ

గూడూరు మండలం భూపతి పేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ను ఎస్పీ శబరీష్ శనివారం తనిఖీ చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్న విధానం, తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో నగదు, నిషేధిత వస్తువులు తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
Similar News
News December 1, 2025
మెదక్: శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్

మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు. మొయినాబాద్ ఐఐటీఏ శిక్షణకు వివిధ జిల్లా నుంచి 51 మంది హాజరయ్యారు. జిల్లాకు చెందిన ప్రదీప్, ప్రశాంత్, రాకేష్ హాజరయ్యారు. ఫైరింగ్, పీపీటీ విభాగాల శిక్షణలో ప్రశాంత్ ఉత్తమ ప్రతిభ చూపి మెడల్ పొందాడు. ప్రశాంత్‌ను ఎస్పీ అభినందించారు.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News December 1, 2025
పింఛన్లు పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

పింఛన్లు పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్ల సొమ్ములను కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.


