News October 13, 2025

గూడూరు మండలంలో భూప్రకంపనలు అంటూ పుకార్లు?

image

గూడూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. కాగా మండలంలో రాత్రి ఒంటి గంట సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడింది. దీంతో ఇదేసమయంలో కొందరు స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు SMలో పుకార్లు సృష్టించారు. భూప్రకంపనలు నిజం కాదని స్థానికులు తెలిపారు.

Similar News

News October 13, 2025

జగిత్యాల: స్కాలర్షిప్స్.. 3 రోజులే ఛాన్స్..!

image

BD కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగుస్తుందని BD కార్మికుల దవాఖాన వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆన్లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30తో గడువు ముగియాల్సి ఉండగా మరోసారి లాస్ట్ డేట్‌ను 15కు పొడిగించారు.

News October 13, 2025

HZB: ఈనెల 17న స్పెషల్ యాత్రా బస్సు

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు ఒకరోజు యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.430 టికెట్ చార్జీలతో స్పెషల్ బస్సు వెళుతుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971 నంబర్లను సంప్రదించాలన్నారు.

News October 13, 2025

అఫ్గాన్-పాక్ మధ్య సరిహద్దు వివాదమేంటి?

image

పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో గీసిన ఈ లైన్‌పై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Durand Lineను అఫ్గాన్ ఒప్పుకోలేదు. PAK మాత్రం ఆ లైన్‌ను ‘అంతర్జాతీయ సరిహద్దు’ అంటోంది. ఈక్రమంలో తాలిబన్ పాలనలో వివాదం మళ్లీ మొదలైంది. తాలిబన్ ఫైటర్లు పాక్ పెట్టిన కంచెను తొలగించడంతో గొడవ ముదిరింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.