News March 22, 2025

గూడూరు: రోడ్డుపై మొసలి కలకలం

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

Similar News

News February 27, 2026

కవిత కుటుంబంలో చిచ్చు పెట్టిన కేసు.. ఇప్పుడు క్లీన్‌చిట్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ CM KCR కూతురు కవిత అరెస్ట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో BRS‌తో పాటు కుటుంబానికి కవిత దూరమయ్యారు. కానీ తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఆమె చెబుతూ వచ్చారు. జైలు నుంచి వచ్చాక కష్ట సమయంలో పార్టీతో పాటు సోదరుడు కేటీఆర్ మద్దతు లభించలేదంటూ బహిరంగంగా విమర్శించారు. తర్వాత పార్టీని వీడారు. కేసులో ఇప్పుడు ఆమెకు <<19251453>>క్లీన్‌చిట్<<>> రావడం గమనార్హం.

News February 27, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

News February 27, 2026

పంట నష్టంపై శాస్త్రీయంగా నివేదికలు ఇవ్వాలి: కలెక్టర్

image

అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన పంటల ప్రాథమిక వివరాలను వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ శాస్త్రీయంగా ఉండాలని స్పష్టం చేశారు. పంట నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు.