News October 7, 2025
గూడూరు: వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరణ: ఎక్సైజ్ CI

గూడూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 2025-27 మద్యం పాలసీలో భాగంగా మంగళవారం ఒక దరఖాస్తు స్వీకరించినట్లు CI బిక్షపతి తెలిపారు. గూడూరు 2, గంగారం 2, కొత్తగూడ 2, కేసముద్రంలో 1 (ST), కేసముద్రం1, ఇనుగుర్తి 1 (SC), కేసముద్రం2, గుండెంగ 1 షాపులను (జనరల్)గా కేటాయించినట్లు CI పేర్కొన్నారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ IDOCలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News October 7, 2025
మార్టూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మార్టూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనార్దన్ కాలనీలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన రాంబాబు (38) ప్రమాదవశాత్తు ఇంటిదగ్గర కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News October 7, 2025
గుడ్‌న్యూస్.. ఫ్రీగా ట్రైన్ టికెట్ తేదీల మార్పు

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కన్ఫామైన ట్రైన్ టికెట్ డేట్స్‌ను ఇకపై ఫీజు లేకుండా మార్చుకునేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. JAN నుంచి ఇది అమల్లోకి వస్తుందని, టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కొత్త తేదీల్లో టికెట్ కన్ఫర్మేషన్‌కు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అటు దీపావళికి దేశవ్యాప్తంగా 12,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.
News October 7, 2025
కాంతార డ్రెసప్‌తో దైవాన్ని అపహాస్యం చేయొద్దు: రిషబ్ శెట్టి

‘కాంతార’ దైవ వస్త్రధారణతో అభిమానులు థియేటర్లలోకి రావడం, వీడియోలను SMలో పెట్టడం సరికాదని నటుడు రిషబ్ శెట్టి తెలిపారు. ఫ్యాన్స్ ఇలా చేయడం బాధిస్తోందని పేర్కొన్నారు. ఇది దైవాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘మేం చాలా పవిత్రంగా దైవ పాత్రలను సినిమాలో చూపించాం. ఎమోషన్స్ కోసం కొన్ని సన్నివేశాలు, దృశ్యాలను మూవీలో పెడుతుంటాం. SMలో వైరలవ్వడం కోసం కొందరు ఇలా చేయడం మానుకోవాలి’ అని కోరారు.