News November 28, 2024

గూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

image

చిల్లకూరు(మం) కడివేడు సమీపంలో బుధవారం రాత్రి ఓ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.  చిల్లకూరు ఎస్‌ఐ సురేశ్ రెడ్డి వివరాల ప్రకారం.. కడివేడు వద్ద బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న కడివేడు గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 28, 2026

నెల్లూరు జిల్లాలో 33 మందికి కేంద్ర పతకాలు

image

నెల్లూరు జిల్లాలో 2025లో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అతి ఉత్కృష్ట సేవ, ఉత్కృష్ట సేవా పతకాలను ప్రకటించింది. 13 మంది అతి ఉత్కృష్ట. 23 మంది ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు.

News February 28, 2026

నెల్లూరు జిల్లాకు రూ.126.91 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,89,647 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం రూ.126.91 కోట్లను కేటాయించిందని DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.

News February 28, 2026

నెల్లూరు జిల్లాలో ప్రిన్సిపల్ సూసైడ్

image

చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బి.సునీల్(38) పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయలేదు. బంధువులు ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతకగా.. మడమనూరు సమీపంలో విషం తాగి పడిపోయినట్లు గుర్తించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చనిపోయారు. అప్పులు, వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.