News August 9, 2024
గూడూరు: KG నిమ్మ రూ.130

గూడూరు నిమ్మ మార్కెట్‌లో నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. గత 4 రోజులుగా అత్యధికంగా రూ.90 నుంచి రూ.100 పలికాయి. గురువారం రూ.100పైగా అమ్ముడుపోవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. బస్తా లూజు మొదటి రకం KG రూ.100 నుంచి రూ.130 చొప్పున, రెండో రకం KG రూ.60 నుంచి రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. శ్రావణమాసంలో దక్షిణ ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేయడంతో నిమ్మధరలు పెరిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 10, 2026
నెల్లూరు: 12న మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్

నెల్లూరు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలన్నారు. www.apms. apcfss.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 10, 2026
నెల్లూరు జిల్లాలో 30 ఏళ్లుగా ఎదురుచూపులు!

రాపూరు(M) కండలేరు జలాశయం నిర్మాణానికి భూములు ఇచ్చిన 19 గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఎకరాల భూములతో పాటు విలువైన పండ్ల తోటలను కోల్పోయారు. ఇందులో కొంతమందికే ఇళ్లు కేటాయించారు. 117 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చినప్పటికీ మరో 60 కుటుంబాలకు ఇప్పటికీ కాలనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 10, 2026
నెల్లూరులో సిటీ బస్సులు.. ఛార్జీలు ఇవే!

నెల్లూరులో శనివారం నుంచి <<19607446>>సిటీ సర్వీసులు <<>>ప్రారంభం కానున్నాయి. బస్సులు తిరిగే రూట్లు, ధరలు ఇలా..
RTC- అయ్యప్ప గుడి(రూ.10)
RTC-కొత్తూరు(రూ.20)
RTC-ఇనమడుగు క్రాస్ రోడ్డు(రూ.20)
RTC-ములుమూడి బస్టాండ్(రూ.10)
నవాబుపేట-ఆత్మకూరు బస్టాండ్(రూ.10)
నారాయణ హాస్పిటల్-VRC సెంటర్(రూ.20)


