News December 28, 2025

గూడెం కొత్తవీధి: ఆరో తరగతి విద్యార్థిని మృతి

image

గూడెం కొత్తవీధి మండలం సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొంది. ఆరో తరగతి చదువుతున్న పాంగి నిర్మల (11) ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. శనివారం జ్వరంతో బాధపడగా చికిత్స చేయించారు. ఆదివారం పాఠశాలలో ఒక్కసారిగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యాధికారి నారాయణరావు ధృవీకరించారు. చిన్న వయసులోనే విద్యార్థిని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Similar News

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (2/4)

image

✎ అక్రమ ఎర్రచందనం రవాణాలో 9 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 1979 కేజీల 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
✎ గంజాయి విక్రయాలపై చేసిన దాడుల్లో 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్ట్ చేశారు. 46.27 కిలోల గంజాయిని స్వాధీనం.
✎ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 77,899 కేసులు నమోదు చేసి రూ.2,06,82,743 జరిమానాలు విధించారు.
<<18714488>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (3/4)

image

✎ సైబర్ నేరాలలో 57 కేసులు నమోదు, 33 కేసులు ఛేదించి రూ.3.05 కోట్లు రికవరీ/ఫ్రీజ్.
✎ జూదాలలో 458 గ్యాంబ్లింగ్, 240 మట్కా, 40 క్రికెట్ బెట్టింగ్, 29 కోడిపందేలలో కేసులు నమోదయ్యాయి. 3,473 మంది అరెస్ట్ కాగా.. రూ.1,65,57,268 స్వాధీనం.
✎ 374 అక్రమ మద్యం కేసులు నమోదైతే 423 మందిని అరెస్ట్ చేసి 1450 లీటర్ల మద్యం స్వాధీనం.
✎ మిస్సింగ్ కేసుల్లో 90 శాతం ఛేదింపు.
<<18714484>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (4/4)

image

✎ CEIR పోర్టల్ ద్వారా రూ1.3 కోట్ల విలువైన 1,155 మొబైల్ ఫోన్లు రికవరీ.
✎ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 11 కేసుల్లోని ముద్దాయిలకు జీవిత భైదు, 3 కేసుల్లో 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధింపు.
మొత్తానికి జిల్లాలో నేరాల శాతం తగ్గిందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. వచ్చే ఏడాది కట్టుదిట్టచర్యలతో క్రైం రేటును తగ్గిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ పేర్కొన్నారు.