News December 14, 2024

గూడెం దేవాలయంలో ట్రిబ్యునల్ ఛైర్మన్ పూజలు

image

దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సమేతంగా గూడెం గుట్ట దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు దేవాలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 20, 2025

బ్లాక్ మెయింగ్‌కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

image

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News December 20, 2025

నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్‌గా..

image

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్‌ను గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.

News December 20, 2025

గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.