News May 7, 2025

‘గృహ నిర్మాణాల్లో ప్రతివారం పురోగతి కనిపించాలి’

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణాల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్, హౌసింగ్, నరేగా, తాగునీటి సమస్యలు, గ్రామ/వార్డు సచివాలయాల కార్యకలాపాలు, పెన్షన్ పంపిణీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి సమీక్షించారు.

Similar News

News April 1, 2026

టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

image

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.

News April 1, 2026

అనకాపల్లి: రూ.1192.45 కోట్ల మద్యం తాగేశారు

image

అనకాపల్లి జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1192.45 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు 15.47 లక్షలు, బీర్ బాక్సులు10.11 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1139.26 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై 5 శాతం పెరిగాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 59 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

News April 1, 2026

హనుమకొండ: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.