News September 15, 2025
గృహ హింస బాధితులకు వరంగల్ పోలీసుల సహాయ హామీ

గృహ హింసపై ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలని వరంగల్ పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. బాధితుల హక్కులను కాపాడడంలో సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. తక్షణ సహాయం కోసం గృహ హింస బాధితులు ఎప్పుడైనా డయల్ 100కు కాల్ చేయవచ్చని, 24 గంటల సహాయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
Similar News
News September 15, 2025
దూబే ఉంటే టీమ్ ఇండియాకు ఓటమి దూరం!

టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే అరుదైన రికార్డు నెలకొల్పారు. వరుసగా 31 టీ20 మ్యాచుల్లో ఓటమెరుగని క్రికెటర్‌గా నిలిచారు. ఆయన ఆడిన గత 31 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో నిన్న జరిగిన మ్యాచులోనూ ఈ పరంపర కొనసాగింది. 2020లో న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతోంది. 31 మ్యాచుల్లో 25 గెలవగా నాలుగు టై అయ్యాయి. రెండింట్లో ఫలితం తేలలేదు.
News September 15, 2025
భార్యాభర్తలు.. ఇద్దరూ కలెక్టర్లే

ఏపీ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్‌శుక్లా పదవీ బాధ్యతలు చేపట్టగా ఆయన సతీమణి కృతికాశుక్లా కూడా నిన్నే పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ భార్యాభర్తలు ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కాగా మరొకరు హర్యానాకు చెందిన వారు. ఇద్దరూ కుటుంబంతోపాటు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
News September 15, 2025
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేడు ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు తెలిపారు.