News August 17, 2025
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి: SP

క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జిల్లా SP దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం కరాటే పోటీలకు హాజరైన విద్యార్థులను ఎస్పీ స్వయంగా పలకరించి, కరాటేలో రాణిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా సామాజిక స్పృహ పెరగడంతో పాటు, మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు.
Similar News
News August 17, 2025
ఒంగోలు: పొగాకు రైతులకు గమనిక

పొగాకు రైతులకు ఒంగోలు పొగాకు వేలం నిర్వహణ అధికారిణి తులసి కీలక సూచనలు చేశారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో బ్యారన్లకు ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పొగాకు బ్యారన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మూడేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని రైతులు గమనించాలని కోరారు. కౌలు రైతులు తప్పనిసరిగా సర్టిఫికెట్ లీజు కోసం నో డ్యూస్‌తో తమను సంప్రదించాలని సూచించారు.
News August 17, 2025
మార్కాపురంలో వద్దని కొందరి వాదన..!

ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై చర్చ సాగుతోంది. దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరుతో జిల్లా ఏర్పడవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలో మార్కాపురం జిల్లాలో కలిసే మండలాల ప్రజలు భిన్నరీతిలో తమ వాదన వినిపిస్తున్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతున్నారు. మరి మీ మండలాలు మార్కాపురం ఉండాలా? ప్రకాశం జిల్లాలో ఉండాలా? అని కామెంట్ చేయండి.
News August 17, 2025
ఒంగోలు: ఘాట్ రోడ్లలోనూ FREE బస్

శ్రీశైలం, నంద్యాల ఘాట్ రోడ్లలోనూ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకాశం జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులో ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఘాట్ రోడ్లలో సీట్లు ఖాళీగా ఉన్నంత వరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.