News April 6, 2025

గెస్ట్ హౌస్ నుంచి మిథిలా స్టేడియానికి సీఎం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచల సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావుతో కలిసి మిథిలా స్టేడియానికి వెళ్లారు.

Similar News

News April 8, 2025

ఖమ్మంలో ఈ నెల 9న జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News April 8, 2025

బెటాలియన్‌కు ఎంపీ రూ.20 లక్షలు మంజూరు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాతకొండలో గల 6వ బెటాలియన్‌లో పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధులు కేటాయింపు లేఖను సంబంధిత అధికారులకు అందజేశారు. బెటాలియన్ కమాంటెండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు గతంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్‌కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

News April 8, 2025

ఖమ్మం జిల్లాలో ఉదయం ఎండ, సాయంత్రం వాన

image

ఖమ్మం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఈదురుగాలలో కూడిన వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు.

error: Content is protected !!