News March 20, 2025
గేట్ ఫలితాల్లో యువతి సత్తా

శ్రీకాకుళం క్యాంపస్ (ఎచ్చెర్ల) త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినీ గేట్-2025లో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు కొమరాల శ్వేత శ్రీ, 241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంక్‌లు వచ్చాయని డైరక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. విద్యార్థినిని బాలాజీ గురువారం అభినందించారు.
Similar News
News March 21, 2025
శ్రీకాకుళం: పావురం ఈకపై.. సునీత విలియమ్స్ చిత్రం

అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గౌరవార్థం పావురం ఈకపై ఆమె చిత్రాన్ని గురువారం నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ రూపొందించారు. రాహుల్ గతంలో కూడా పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, కృష్ణుడు, ఆదిత్యుడు మరెన్నో చిత్రాలు గీశారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు పొందారు.
News March 21, 2025
SKLM: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం మార్చి 21న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 20, 2025
SKLM: హాస్టళ్లలో నాణ్యత పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి తొమ్మిది మందితో జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి కలెక్టరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.