News January 28, 2025
గొంగడి త్రిష సెంచరీ.. మంత్రి రాజనర్సింహ అభినందనలు

ఉమెన్స్ U-19 క్రికెట్ కప్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని నమోదు చేసిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆమె మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని, అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించాలని అనుకుంటున్న ఎంతోమంది ఆడబిడ్డలకు త్రిష ప్రదర్శన స్పూర్తిగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News September 16, 2025
జేపీ నడ్డాకు మోరి జీడిపప్పు దండతో సత్కారం

విశాఖపట్నంలో సోమవారం జరిగిన సారథ్యం సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన జీడిపప్పుతో తయారు చేసిన దండతో సత్కరించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, ఇతర రాష్ట్ర నేతలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమను సత్కరించిన అంబేడ్కర్ కోనసీమ నేతలను జేపీ నడ్డా అభినందించారు.
News September 16, 2025
జాలిమూడి కుడి, ఎడమ కాలువల మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

మధిర జాలిమూడి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనుల కోసం రూ. 5.41 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులను విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మరమ్మతులు పూర్తయితే, ప్రాజెక్టు పరిధిలోని రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని ఆశిస్తున్నారు.
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.