News November 15, 2025

గొర్రె పిల్లలకు వివిధ దశల్లో ఇవ్వాల్సిన ఆహారం

image

గొర్రె పిల్లల పెరుగుదలకు అందించాల్సిన ఆహారంపై వెటర్నరీ నిపుణుల సూచనలు
☛ పిల్ల పుట్టిన మొదటి 3 రోజుల వరకు: తల్లితో పాటు పిల్లను ఉంచి.. పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతి రోజూ అందించాలి.
☛ తొలి 2 వారాల వరకు: పిల్లలను పూర్తిగా తల్లిపాల మీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600ml పాలు అందించాలి. తల్లి వద్ద సరిపడినన్ని పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి.

Similar News

News November 15, 2025

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎయిర్‌పోర్టు

image

AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య MOU కుదిరింది. CM CBN, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని CM తెలిపారు. పర్యాటకరంగం వృద్ధి చెందుతుందన్నారు.

News November 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 67 సమాధానాలు

image

ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
జవాబు: విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, భృగు మహర్షి ఆయన వక్షస్థలంపై కాలితో తన్నారు. అప్పుడు విష్ణువు ఏమాత్రం కోప్పడకుండా మహర్షి పాదాలకు క్షమాపణ చెప్పారు. తన నివాస స్థలమైన వక్షస్థలాన్ని ఒకరు కాలితో తన్నినా, విష్ణుమూర్తి అతడిని శిక్షించకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి కోపంతో భూమ్మీదకు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 15, 2025

IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

image

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.