News December 10, 2025

గొలుగొండ: బాలిక గర్భం దాల్చిన ఘటనపై పోక్సో కేసు నమోదు

image

గొలుగొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలిక గర్భం దాల్చిన ఘటనపై విచారణ చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రామారావు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు.

Similar News

News December 15, 2025

గజ్వేల్: సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రం

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై ఆయన చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు అయిన రామరాజు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నవ భారత నిర్మాత, ఉక్కు మనిషి, గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు.

News December 15, 2025

తిరుమల.. మార్చి నెల టోకెన్ల విడుదల తేదీలివే

image

⁎ మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా DEC 18న 10amకి ఆన్‌లైన్‌లో విడుదల, 20వ తేదీ 10am వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ 12pmలోగా నగదు చెల్లించాలి
⁎ 22న 10amకి కల్యాణోత్సవం, తెప్పోత్స‌వాల‌ టికెట్లు, 3pmకి వర్చువల్ సేవల కోటా రిలీజ్
⁎ 23న 10amకి అంగప్రదక్షిణ, 11amకి శ్రీవాణి ట్రస్ట్, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 24న 10amకి ₹300 టికెట్లు, 3pmకి గదుల కోటా విడుదల

News December 15, 2025

కలెక్టర్‌ను కలిసిన అన్నవరం ఈవో

image

అన్నవరం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన వేండ్ర త్రినాధరావు సోమవారం కలెక్టర్ షాన్‌మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రత్నగిరిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. గతంలో రెండుసార్లు ఈ ఆలయ ఈవోగా పనిచేసిన అనుభవం తనకుందని, భక్తులే దేవుళ్లనే భావనతో ఆలయ అభివృద్ధికి శ్రమిస్తానని త్రినాధరావు కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.